హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఏచూరి

హరిద్వార్‌లో పోలీస్‌ కేసు నమోదు
హరిద్వార్‌,మే4(జ‌నంసాక్షి):  హిందువులు కూడా హింసా ప్రవృత్తిగలవారేనని, రామాయణ, మహాభారతాల్లో కూడా హింస ఉన్నదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు అందింది.  ఆ వ్యాఖ్యలను యోగా గురువు బాబా రాందేవ్‌ తప్పుపట్టారు. ఆయన ఇతర సాధువులతో కలిసి హరిద్వార్‌లో సీతారం ఏచూరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువులు
హింసను విశ్వసించరని ప్రజ్ఞాసింగ్‌ ఠాగూర్‌ ఇటీవల అన్నారు. కానీ ఈ దేశంలోని ఎంతో మంది రాజులు, రాజ్యాల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. రామాయణ, మహాభారతాలు కూడా మొత్తం హింస, యుద్ధాలతోనే నిండి ఉన్నాయని ఏచూరి వ్యాఖ్యానించారు. హింసతో నిండిన హిందూ పురాణాల గురించి విూ ప్రచారంలో ప్రస్తావిస్తూ.. హిందువులు హింసకు వ్యతిరేకమని ఎలా చెప్తారు? అని గురువారం భోపాల్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఏచూరి ప్రశ్నించారు. ఇది పూర్తిగా అసత్యమని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఏచూరి వ్యాఖ్యలుచేశారని బాబా రాందేవ్‌ అన్నారు.