హిల్లరీ ఐసిస్‌ ఫౌండర్‌: ట్రంప్‌

4brk-trump1వాషింగ్టన్‌: ఎన్నికలు సమీపిస్తుండడం, ప్రచారం వూపందుకోవడంతో ప్రత్యర్థిపై ట్రంప్‌ విమర్శల జోరు కూడా పెరిగింది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ట్రంప్‌.. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్‌పై విమర్శల తీవ్రత మరింత పెంచారు. ట్రంప్‌ ఫ్లోరిడాలోని ఓ ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ ఏకంగా ఆమెను ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ వ్యవస్థాపకురాలు అని పేర్కొన్నారు. గతంలో ట్రంప్‌ హిల్లరీని మోసకారి అని విమర్శించేవారు.. ఇటీవల ఆమె దెయ్యం అని అన్నారు.. ఇప్పుడు ఐసిస్‌ ఫౌండర్‌ అంటూ విమర్శలను తారాస్థాయికి తీసుకెళ్లారు. తాను అధ్యక్షుడిగా ఉంటే అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై 9/11 ఉగ్రదాడి జరిగి ఉండేది కాదని ఫ్లోరిడా ర్యాలీలో ట్రంప్‌ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆర్లాండో షూటింగ్‌ ఘటన, శాన్‌బెర్నార్డినో ఉగ్ర దాడి, వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన దాడి, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉగ్ర దాడులను చూడండి.. ఐసిస్‌ని ఈ స్థాయిలో దాడులు చేయనిస్తున్నాం అని ట్రంప్‌ అన్నారు.