హిల్లరీ స్వల్ప ముందంజ
వాషింగ్టన్,నవంబర్ 6(జనంసాక్షి): మరో రెండు రోజుల్లో అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సమరం ప్రారంభంకానుంది. అధ్యక్ష బరిలో డెమోక్రటిక్ పార్టీ తరపు నుంచి నిలిచిన హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ నుంచి నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌లు ¬రా¬రీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకోవైపు ఎవరికి ప్రజల్లో ఎక్కువ మెజార్టీ ఉందో తెలుసుకునేందుకు అంతర్జాతీయ వార్తా ఛానళ్లు సర్వేలను నిర్వహిస్తున్నాయి. వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ ట్రాకింగ్ పోల్ తాజా సర్వేల ప్రకారం ఐదు పాయింట్ల ఆధిక్యంలో హిల్లరీనే ముందంజలో ఉన్నారు. ఆదివారం తాజా సర్వేకి సంబంధించిన వివరాలను వెల్లడించింది.ఈ సర్వేలో హిల్లరీ 48 శాతం పాయింట్లతో ఉండగా, ట్రంప్ 43 శాతం పాయింట్లతో ఉన్నారు. శుక్రవారం విడుదల చేసిన ఏబీసీ పోల్‌లో హిల్లరీ 47శాతం, ట్రంప్ 44 శాతం పాయింట్లతో ఉన్నారు. ట్రంప్ మద్దతుదారులతో పోల్చుకుంటే 55 శాతం మంది హిల్లరీకి మద్దతుగా నిలిచారు.