హిల్లరీ సభలో ట్రంప్ మద్దతుదారుడు
నార్త్ కరోలినాలో ఎన్నికల సభ జరుగుతోంది. డెమోక్రటిక్ పార్టీ నిర్వహిస్తున్న ఆ సభలో ట్రంప్ మద్దతుదారుడు ఒకరు ప్లేకార్డు ప్రదర్శించాడు. అతన్ని చూసిన హిల్లరీ మద్దతుదారులు గట్టిగా కేకలు, అరుపులు చేయడం మొదలుపెట్టారు. మిలిటరీ దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి ట్రంప్ పోస్టర్‌తో ఆ సభలో నిలుచున్నాడు. హిల్లరీ మద్దతుదారులు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఆరంభించారు. ప్రసంగం చేయడానికి వచ్చిన ఒబామా తమ కార్యకర్తలను అదుపులోకి తెచ్చేందుకు తెగ ప్రయత్నించారు. ట్రంప్ ప్లకార్డ్ పట్టుకున్న వ్యక్తి ఓ మాజీ సైనికుడని, అతన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఒబామా తమ పార్టీ మద్దతుదారులకు తెలిపారు. మిలటరీ వ్యక్తిని చూసి మనం మన దృష్టిని కోల్పోరాదని, మన లక్ష్యంపైనే మన ఫోకస్ ఉండాలని, డెమోక్రటిక్ పార్టీ తరపునే తమ ఓటును వేయాలని ఒబామా ఈ సందర్భంగా సభలో మద్దతుదారులను ఉద్దేశించి కోరారు.