హృదయ స్పందన కార్యక్రమంలో

చిన్నారులకు గుండె సంబంధ శస్త్ర చికిత్సలు
కరీంనగర్‌, జనవరి 30 (ఎపిఇఎంఎస్‌): హృదయ స్పందన కార్యక్రమానికి ఒకటవ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ ఉండింటి శ్రీనివాస్‌ పోలీస్‌, పి.సి.నె.278, కరీంనగర్‌ రూ. 3,116లు విరాళం అందించడం అభినందనీయమని కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. 12 సంవత్సరాల లోపు నిరుపేద కుటుంబాల చిన్నారులకు ఖరీదుతో కూడిన గుండె సంబంధ శస్త్ర చిక్సితలు నిర్వహించివారి జీవితాల్లో వెలుగులు నింపడానికి హృదయ స్పందన కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని కలెక్టర్‌ అన్నారు. రూ.3,116 చెక్కను బుధవారం కలెక్టరేట్‌లోని కలెక్టర చాంబర్‌లో కలెక్టర్‌కు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ అందజేశారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన హృదయ స్పందన చక్కని కార్యక్రమమని హెడ్‌ కానిస్టేబుల్‌ జవ్వాజి రాజయ్య హృదయ స్పందనకు ఇచ్చిన విరాళం స్ఫూర్తిత నేను కూడా విరాళంగా రూ.3,116లు చెక్కును జిల్లా కలెక్టర్‌కు అందజేశానని కానిస్టేబుల్‌ ఉండింటి శ్రీనివాస్‌ తెలిపారు.