హెచ్‌సీయూ విద్యార్థులపై వెంటనే కేసులు ఉపసంహరించుకోండి

తెలంగాణ సర్కారు మంచి నిర్ణయం..
` న్యాయపరమైన సమస్యలు రావొద్దు
` పోలీసు అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం.
హైదరాబాద్‌ (జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలోటీచర్స్‌ అసోసియేషన్‌, సివిల్‌ సొసైటీ గ్రూప్స్‌ తో సబ్‌ కమిటీ సభ్యులైన మంత్రులు దుదిల్ల శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తో కలిసి చర్చల తదుపరి డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. జ్యూడిషియల్‌ రిమాండ్‌ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్‌ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు.జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్‌ అధికారులకు తగు సూచనలు చేయాల్సిందిగా న్యాయశాఖ అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు.కొద్ది రోజుల క్రితం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో రణరంగాన్ని తలపించింది. దీంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. ఈ క్రమంలో ప్రధాన గేటు వద్ద పోలీసుల భారీగా మోహరించారు. మరో గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.: హెచ్‌సీయూ గేటు దూకి లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నం చేశారు. లోపల జరుగుతున్న పనులను అడ్డుకుంటామని ఏబీవీపీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చదును చేస్తున్న భూమి వద్దకు 200 మంది ఏబీవీపీ కార్యకర్తలు వెళ్లారు. ఈ నేపథ్యంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌?కు తరలించారు.

 

 

తాజావార్తలు