హెచ్.సి.ఎ కార్యదర్శిగా శ్రీధర్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా శ్రీధర్ ఎన్నికయ్యారు. క్రికెట్ సంఘం ఆఫీస్ బేరర్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు శ్రీధర్ ఎన్నికైనట్లు తెలిపారు. ఉపాధ్యక్షులుగా శావలాల్ యాదవ్, వెంకటపతిరాజు,యాదగిరి, వెంకటరామిరెడ్డి,విద్యుత్ జయసింహ, కార్యదర్శిగా ఎం.వి.శ్రీధర్ ఎన్నికయ్యారు. హెచ్.సి.ఎ అధ్యక్షుడిగా జి.వినోద్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.