హైకోర్టు విభజనపై బాబు ద్వంద్వ వైఖరి

ఆయన వ్యాఖ్యలపై మండిపాటు
1న జడ్జీల ప్రమాణానికి ఏర్పాట్లు
అమరావతి,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  జనవరి ఒకటో తేదీన ఆంధప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. చంద్రబాబు అయిష్టానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైకోర్టు విభజనకు తనకు అభ్యంతరాలు లేవంటూనే సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఎపిలోనూ విమర్శలు వస్తున్నాయి. మన హైకోర్టు మనకు కావాలని కోరుకుంటున్న వారు బాబు వ్యాఖ్యలతో మండిపడుతున్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌పై కేసుల విచారణ దాదాపు ఒక కొలిక్కి వస్తున్న దశలో…. విచారణ జాప్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న ధోరణిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారు. హైకోర్టుని హడావుడిగా విభజించడం… న్యాయాధికారులు, ఉద్యోగులు మానసికంగా సిద్ధమయ్యేందుకూ గడువివ్వకుండా ఆంధ్రప్రదేశ్‌కి తరలించమనడం దానిలో భాగమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని చెప్పారు. హైకోర్టు విభజన నేపథ్యంలో జగన్‌పై కేసులు విచారిస్తున్న సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని, కేసుల విచారణ మళ్లీ మొదటికి వస్తుందని వెల్లడించారు. అయితే ఐదేళ్లు కావస్తున్నా ఇంకా చంద్రబాబు వైఖరి మారలేదని అంటున్నారు. ఇకపోతే జనవరి 1న మంగళవారం
ఉదయం 10.30గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జడ్జిల ప్రమాణస్వీకార
కార్యక్రమం జరగనుంది. అమరావతి పరిధిలో నిర్మిస్తున్న సిటీ సివిల్‌ కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి నెలాఖరు లేదా వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర హైకోర్టు.. సిటీ సివిల్‌ కోర్టు కాంప్లెక్స్‌కు తరలి వెళ్లనుంది. ఈలోపు హైకోర్టు కార్యకలాపాలను విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో పది కోర్టు హాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ భవనంలో పదివేల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌లో హైకోర్టు పరిపాలన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. హైకోర్టు జడ్జిలు, రిజిస్ట్రార్లకు నోవాటెల్‌ ¬టల్‌లో బస ఏర్పాటు చేయనుండగా.. ఉద్యోగులు, సిబ్బందికి వసతి ఏర్పాట్లకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ రాజకీయ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.