హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రకటించాలి
మెదక్, జనవరి 19 హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రకటించాలని డిమాండ్‌తో శనివారంనాడు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తెలంగాణ భవన్‌లో ప్రారంభమైన బైక్ ర్యాలీ రాందాస్ చైరాస్తా మీదుగా పట్టణంలో పురవీధుల గుండా తిరుగుతూ జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కేంద్రప్రభుత్వం హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం, సీట్లకోసం అంటూ సీమాంధ్రనాయకులు కొత్తనాటకం ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో వెయ్యిమంది బలిదానాలు చేశారని అన్నారు. ఉద్యోగ, ఉపాధితో పాటు అన్ని రంగాలలో తెలంగాణ వాసులకు అన్యాయం చేశారని అన్నారు. ఈ నెల 28 వరకు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను చేపడుతున్నట్లు వారు ప్రకటించారు. మెదక్ నియోజకవర్గం పాపాన్నపేటలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బైక్ ర్యాలీలో సుధాకర్, నాగరాజు, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.