హోంటౌన్‌ షాపింగ్‌ మాల్‌పై అధికారుల దాడుల

హైదరాబాద్‌ : పంజాగుట్టలోని హోంటౌన్‌ షాపింగ్‌ మాల్‌లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎంఆర్‌పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. షాపింగ్‌ మాల్‌లోని వస్తువులు స్వాధీనం చేసుకోవడంతో పాటు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.