హోదాకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది

– అధికారంలోకి వచ్చిన వెంటనే ¬దాపై రాహుల్‌ సంతకం
– కాపుల రిజర్వేషన్లు కాంగ్రెస్‌తోనే సాధ్యం
– రిజర్వేషన్ల విషయంలో జగన్‌ యూటర్న్‌ తీసుకున్నాడు
–  వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం
– కాంగ్రెస్‌ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్‌ చాందీ
ఏలూరు, జులై31(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కల్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్‌ ఏపీ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్‌ చాందీ స్పష్టం చేశారు. ఏలూరులో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక ¬దా అంశం గురించి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక ¬దా ఐదేళ్లు అని యూపీఏ ప్రతిప్రాదిస్తే కాదు పదేళ్లు ఇవ్వాలన్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రజలను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో నాలుగేళ్లుగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక ¬దా కోసం ఎందుకు మాట్లాడలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తాజా తీర్పుపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని, కాపులకు రిజర్వేషన్లపై వైఎస్‌ జగన్‌ వెనుకడుగు వేయడం దారుణమన్నారు. 25 మంది ఎంపీలుంటే ప్రత్యేక ¬దా తీసుకు వస్తానని వైఎస్‌ జగన్‌ ఎలా అన్నారని, ప్రత్యేక ¬దా కూడా కేంద్ర పరిధిలోనిదే కదా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ మాత్రమే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వగలదన్నారు. ప్రత్యేక ¬దా, కాపుల రిజర్వేషన్ల విషయంలో ప్రాంతీయ పార్టీలు ఏవిూ చేయలేవని చెప్పారు. ఏపీలో 44000 బూత్‌ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలిపారు.  అనంతరం ముస్లింల రిజర్వేషన్‌లపై విలేకరుల ప్రశ్నించగా.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్ల గురించి నేను ఎలా మాట్లడతా.. నేను ఏపీకి మాత్రమే ఇన్చార్జిని అని స్పష్టం చేశారు. తమిళనాడులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అదే విధంగా ఏపీలో కూడా ఇబ్బందులు రాకుండా రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆలోచన చేస్తామని వ్యాఖ్యానించారు.
ప్రజా సమస్యలు టీడీపీ, వైసీపీ గాలికొదిలేశాయి – రఘువీరా
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే తొలి సంతకం ద్వారా రాహుల్‌ గాంధీ ప్రత్యేక ¬దా ఇవ్వడం ఖాయం అని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఏలూరులో మాట్లాడుతూ… పార్లమెంట్‌ లో అవిశ్వాస తీర్మానం ఏపీతోనే ప్రారంభమైందని తెలిపారు. ఏపీనే కాకుండా రైతులు, యువకులు, మహిళలతో పాటు దేశ రక్షనే ప్రమాదంలో పడిందన్నారు. అవిశ్వాస తీర్మానంలో ఎంపీ గల్లా జయదేవ్‌ కేవలం ప్రత్యేక ¬దా ఒక్కటే మాట్లాడారన్నారు. ప్రజల సమస్యలపై టీడీపీ గానీ, వైసీపీ గానీ పోరాడలేదని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్‌ దొంగచాటు కాపురం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. కాంగ్రెస్‌ ఏదయినా సీడబ్ల్యూసీలో తీర్మానం చేస్తే ఏ ఒక్కటీ అమలు కానిది లేదని రఘువీరారెడ్డి గుర్తు చేశారు. 2004లో రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజన హావిూ ఇస్తే.. 10 ఏళ్ల పాటు అన్ని పార్టీల ఏకాభిప్రాయం వచ్చాకే 2013 డిసెంబర్‌ లో తీర్మానం చేసాం అని అన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీలో ప్రత్యేక ¬దా విషయంపై నిర్ణయం తీసుకుందన్నారు. ఏ రాష్ట్రము ఏపీతో పోల్చేది లేదు, ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జేడీ శీలం ఇతర
కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

తాజావార్తలు