హోరాహోరి ప్రచారం

అదిలాబాద్‌, డిసెంబర్‌ 12:ఆర్టీసీ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లావ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాల ప్రకారం ఊపందుకుంటున్నాయి. జిల్లాలోని ఆరు డిపోలలో కార్మికులను ప్రసన్నం చేసుకోడానికి ఆయా సంఘాల నేతలు పడరాని పాటు పడుతున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో   ఆయా కార్మిక  సంఘాల రాష్ట్ర నేతలను రప్పించి సమావేశాలను, సభలను నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో  11 కార్మిక సంఘాలు బరీలో నిలిచినప్పటికీ ప్రధానంగా ఎన్‌ఎంయు, టీఎంయు, ఎప్లాయిస్‌ యూనియన్‌, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సంఘాల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఈ నెల 22న జరిగే ఎన్నికల్లో జిల్లాలోని 6 డిపోలలో మొత్తం 2 వేల 218 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగిచనున్నారు. ప్రతి 2ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ గుర్తింపు సంఘం ఎన్నికలను అన్ని సంఘాలు పోటీగా తీసుకోవడంతో ప్రచారం ముమ్మరంగా కొనసాగు తోంది. గత ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఎన్‌ఎంయు మారిన పరిస్థితిల వల్ల తెలంగాణ మద్దూర్‌ యూనియన్‌తో గట్టిపోటీ ఎదుర్కొంటుంది.తెలంగాణ ఉద్యమ నేపథ్యం కారణంగా ఆరీస్టీ ఎన్నికల్లో పాగా వేసేందుకు తెలంగాణ మద్దూర్‌ యూనియన్‌ తీవ్రంగా కృషి చేస్తోంది.