హౌసింగ్ కుంభ కోణంలో అసలు దొంగలేవరో.. అందరికి తెలుసు
నర్సింహులపేట, మే25 (జనంసాక్షి) :
మండలంలోని వంతడపుల స్టేజి కాంగ్రెస్ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి నివాసంలో శుక్రవారం రోజు న ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు టేకుల యాదగిరి రెడ్డి మాట్లాడుతూ అసలు దొంగలేవరో.. నియోకవర్గం లోని ప్రజలందరికి తెలుసని ఆయన అన్నారు. హౌసింగ్ కుంభ కోణంలో అధికారులతో పాటు మాజీ మంత్రి డిఎస్ రెడ్యా నాయక్ అరెస్టు చేయా లని డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ అనడం సిగ్గు చేట్టాన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో మూడు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పని చేస్తు ఏ ఒక్క నాడు కూడ ఎక్కడ కూడ శిలఫలకం కూడ వేయలేదని ప్రజలందరికి తెలుసున్నారు. ఎమ్మెల్యే గా గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఎంతో భాదకు గురవుతున్నారన్నారు. ఇందిరమ్మ కుంభ కోణంలో నియోజకవర్గంలో సగం పైగ టీడీపీ నాయకులే ఉన్నారని ఆరోపించారు. అంగన్ వాడీ ఉద్యోగా లు ఇప్పిస్తామని ఎమ్మెల్యే ఒకోక్క అభ్యర్థి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు లచ్చం తీసుకోని మచ్చ లేని మాజి మత్రి రెడ్యా నాయక్ పై బుదర జల్లుడు సరికాదన్నారు. గిరిజన కుటుం బంలో పుట్టిన సమితి ప్రసిడెంట్‌గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక్క సారిగా మంత్రిగా గెలిచి ఎంతో అభివృధ్ధి చేశారని అన్నారు. డోర్నకల్ నియోజ కవ్గంలో కోన్ని వేల కోట్లతో రింగ్ రోడ్లు, సీసీి రోడ్లు, మోడల్ స్కూల్‌లు, సబ్ స్టేషన్లు మంచి నీటి బావులు, చేతి పంపులు ఆయన ఆద్వర్యంలోనే జరిగాయన్నారు. మచ్చలేని మా నాయకుడు రెడ్యాకు ఉన్న గుర్తింపు అందరికి తెలిసిందే అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో కనీసం మంచి నీటి వసతులు కూడ లేవని అన్నారు. రె డ్యా నాయక్ కూతురు కవిత మహబాద్ ఎమ్మె ల్యేగా గెలిస్తే తమ ఆగడాలు, భూ దందాలు సాగవని మాజి జెడ్పీటీసీ సభ్యులు జన్నారెడ్డి, వెంకటేశ్వర్లు, మాజి సర్పంజ్ భూక్య నాయక్, రాజవర్థన్ రెడ్డి, వర్గీయూలుగా మారారని ఆరో పించారు. హౌసింగ్ కుంభ కోణం విషయంలో ముందుగా కురవి మండలం సీరోలు నుండి విచారణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజి సర్పంచ్ మల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు కిశోర్, కర్ధుల రామకృష్ణ, సుధీర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.