కార్యకర్తల కోసం మరోసారి తుపాకీ పడతా: రేవంత్‌

కరీంనగర్‌ (జ‌నంసాక్షి) : టీడీపీ కార్యకర్తలను కాపాడుకునేందుకు అవసరమైతే మరోసారి తుపాకీ పడతానని రేవంత్‌రెడ్డి అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 ఎన్నికల్లో తాము మద్దతు ఇచ్చి కేటీఆర్‌ను గెలిపించామని, అలాంటి టీడీపీని ఖాళీ చేస్తామనడం సరైంది కాదని హితవు పలికారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలను సీఎం కేసీఆర్‌ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నేతలు టీడీపీ నేతలను కుక్కలుగా అభివర్ణిస్తున్నారని, ప్రజల కోసం పోరాడేందుకు శునక విశ్వాసాన్ని చూపిస్తామని రేవంత్‌ అన్నారు.