1.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజీవ్‌ యువకిరణాల ద్వారా దాదాపు లక్షా 25 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పేదల కోసం ఇప్పటివరకు 8 లక్షల ఇళ్లు నిర్మించినట్లు అన్నారు. మరో 18 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నట్లు తెలియజేశారు. బ్యాంకు రుణాలు పొందడంలో ఐకేసీ సంఘాలు ముందున్నాయన్నారు. ప్రతీ నియోజకవర్గంలో స్పోర్ట్స్‌ స్టేడియాలే నిర్మిస్తామని చెప్పారు. ఆదివాసిల అభివృద్థి కోసం ప్రత్యేక్ష ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి అవసరమైన నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.