10న జిల్లాకు కేసీఆర్‌ రాక

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 : ఈ నెల10న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి వెల్లడించారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లెబాట, భక్తిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోజరిగే కార్యక్రమానికి హాజరవుతున్నారని అన్నారు. జిల్లాలో పల్లె, భక్తి బాటలు విజయవంతంగా నడుస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్‌, టీడీపీలు దోబూచులాడుతున్నాయని, వారి వల్లే తెలంగాణ రావడంలేదన్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నారాయణరెడ్డి, సుజిత్‌ సింగ్‌ ఠాగూర్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.