10వ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండల విద్యార్థులు

శివ్వంపేట జూన్ 30 జనంసాక్షి :రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో శివ్వంపేట మండల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారాని మండల విద్యా శాఖ అధికారి బుచ్చానాయక్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల ఫలితాలను వెల్లడించారు ఈ మేరకు జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల
చండీ 94.7%
జడ్పీహెచ్ ఎస్ పాంబండ 84.2%
జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల గోమారం 95%
జడ్పీహెచ్ ఎస్ పెద్దగొట్టిముక్కులా 71%,
జడ్పీహెచ్ ఎస్ పిల్లుట్ల 100%,
జడ్పీ హెచ్ ఎస్ చిన్నగొట్టిముక్కులా 89.6%,
జడ్పీ హెచ్ ఎస్ దొంతి 96%,
జడ్పీ హెచ్ ఎస్ రత్నాపూర్ 95%,
జడ్పీ హెచ్ ఎస్ కొంతాన్ పల్లి 85.41%,
కేజీబీవీ శివంపేట 97.2%,
జడ్పీ హెచ్ ఎస్ శివంపేట   94% శతంలతో ఈ పదవ తరగతి ఫలితాలలో ఉత్తమమైన ఫలితాలను
సాధించినటువంటి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అలాగే ఉపాధ్యాయ బృందానికి విద్యార్థినీ విద్యార్థులకు
మండల విద్యాధికారి బుచ్చ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే శివ్వంపేట జడ్పీ హెచ్ ఎస్ పాఠశాలకు చెందిన మానస, అలాగే కేజీబివి పాఠశాలకు చెందిన ఎం. నవీన 9.8, అలాగే ఇదే కేజీబివి కీ చెందిన పీ. లావణ్య 9.8, అదేవిధంగా ఎం. అనూష 9.5 లతో ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు ప్రత్యేక అధికారి మంజుల తెలిపారు.
3 Attachments