1041వ రోజుకు చేరిన దీక్ష
ఆదిలాబాద్, నవంబర్ 12 : తెలంగాణ రాష్ట్ర విషయంలో నాయకులను, పార్టీలను ప్రతి ఒక్కరు నిలదీయాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేనిరహార దీక్షలు సోమవారంనాటికి 1041వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల మంచితనంతోనే తెలంగాణ ప్రాంతంలో పార్టీల ఉనికి ఉందని వారు తిరుగబడితే పార్టీల అడ్రస్సు గల్లంతు కావడం ఖాయమని వారు అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు పని చేయాల్సిన పార్టీలు, నాయకులు తమ స్వయ ప్రయోజనాలకు పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సాహనాన్ని పరీక్షించకుండా వారి మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటామని వారు అన్నారు.