1,058కి చేరిన దీక్షలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 26 : ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామని ఐకాసా నేత అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలెదీక్షలు సోమవారంనాటి 1,058వ రోజు చేసుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్రం స్పందించడం లేదని ఉద్యమాన్ని తీవ్రతరం చేయకతప్పదని వారన్నారు. ప్రజలు సంఘటితంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని అన్నారు. ప్రజల కోరిక మేరకు ఉద్యమంలోకి రాని పార్టీలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. డిసెంబర్‌ మాసం నుండి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.