“సత్యం” తీర్పు తేదీ ప్రకటన ఆగస్టు 11కు వాయిదా

హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో తీర్పు తేదీ ప్రకటనను న్యాయస్థానం వాయిదా వేసింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట సోమవారం సత్యం రామలింగరాజు విచారణకు హాజరయ్యారు. న్యాయమూర్తి కేసును విచారించిన అనంతరం తీర్పు తేదీ ప్రకటనను ఆగస్టు 11కు వాయిదా వేస్తూ తీర్పుచెప్పారు. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించి ఈ కేసులో విచారణ ఐదేళ్లుగా కొనసాగుతోంది.