12 నుంచి నిరవధిక సమ్మె
కరీంనగర్,మార్చి9(జనంసాక్షి): ఒప్పంద కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి కార్మికులు ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 12 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఒప్పంద కార్మిక సంఘాల ఐకాస నాయకులు కోరారు. ప్రస్తుతం అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెను కొనసాగించేందుకు నిర్ణయించాయని, కార్మికులంతా ఐక్యంగా సమ్మెలో పాల్గొనాలని ఐకాస నాయకులు పేర్కొన్నారు. ఒప్పంద కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.