122 కోట్ల ఆస్తుల జప్తునకు ఈడీ అనుమతి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః
వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో 122 కోట్లను జప్తుచేసేందుకు ఇడి అధికారులకు అనుమతినిచ్చింది. విదేశీ మారక ద్రవ్యం (మనీల్యాండరింగ్‌) చట్టం ప్రకారం న్యాయప్రాధికారిక సంస్థ ఎన్‌పోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ కు అనుమతిచ్చింది. అనుమతి పొందిన ప్రకారం ఆస్తులను వినియోగించుకునే హక్కులను కోల్పోతున్న సంస్థల వివరాలిలా ఉన్నాయి. జగతి పబ్లికేషన్‌కు చెందిన 14.50కోట్ల రూపాయల డిపాజిట్లు, హెటిరోకు చెందిన 35ఎకరాల భూమితోపాటు మూడు కోట్లరూ పాయల డిపాజిట్లు, అరబిందో ఫార్మాకు చెంది 96 ఎకరా ల భూమి, 3కోట్ల రూపాయల డిపాజిట్‌, జనని ఇన్‌ఫ్రాకు చెందిన 13 ఎకరాల భూములు న్నాయి. గచ్చిబౌలి లోని 34 విల్లాస్థలాలను సైతం జప్తుచేసుకోవాలని ఇడికి అనుమతి లభించింది. గతంలో ఇడి అనుమతి పొందిన 51కోట్ల డిపాజిట్లు, 71కోట్ల విలువచేసే ఆస్థులు స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది. అయితే గత కొంతకాలంగా తామెలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పుతూ వచ్చిన సంస్థలకు న్యాయప్రాధికారిక సంస్థ నిర్ణయం చెంపదెబ్బలా మారింది.