హోదా కోసం మరొకరు ప్రాణత్యాగం

– ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్‌నోట్‌ రాసి చనిపోయిన సుధాకర్‌
– చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఘటన
– కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
– ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడదంటూ  జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి
చిత్తూరు, జులై28(జ‌నం సాక్షి) : ప్రత్యేక హోదా కోసం మరొకరు ప్రాణత్యాగం చేశారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి సుధాకర్‌(26) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లె రామరావు కాలనీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు రామచంద్ర, సరోజమ్మల కుమారుడు సుధాకర్‌ శనివారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ¬దా కోసం బలిదానం చేసుకోవడం చిత్తూరు జిల్లాలో ఇది రెండో సంఘటన కాగా.. గతంలో నుకోటి అనే వ్యక్తి తిరుపతిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక సుధాకర్‌ ప్రత్యేక ¬దా కోసం నిర్వహించిన కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవాడని స్థానికులు తెలిపారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన చేనేత కార్మికుల సమావేశంలో కూడా సుధాకర్‌ తనగళాన్ని వినిపించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
సేవా గుణం కలిగిన సుధాకర్‌ అతను నివాసం ఉంటున్న కాలనీ సవిూపంలోని ఓ అనాథశ్రమానికి  ఇటీవలె రూ. 5 వేల రూపాయలు విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిరుపేద అయినప్పటికి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని స్థానికులు తెలిపారు. ¬దా కోసం సుధాకర్‌ ఆత్మహత్య చేసుకోవడం జిల్లా
వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ¬దా కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు – వైఎస్‌ జగన్‌
ప్రత్యేక ¬దా కోసం తొందరపడి ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని, అందరం కలిసి పోరాడి సాధించుకుందామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిత్తురు జిల్లా మదనపల్లిలో చేనేత కార్మికుడు సుధాకర్‌ ఆత్మహత్యపై ఆయన దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. సుధాకర్‌ ఆత్మహత్య విషయం గురించి తెలుసుకున్న వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలా తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లి తండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని విజ్ఞప్తి చేశారు. బతికుండి పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. సధాకర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సుధాకర్‌ ఆత్మహత్య బాధాకరం – చలసాని
ప్రత్యేక ¬దా కోసం సుధాకర్‌ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ప్రత్యేక ¬దా, విభజన హావిూల సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ విచారం వ్యక్తం చేశారు. సుధాకర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. ప్రత్యేక ¬దా, విభజన హావిూల సాధనకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని చెప్పారు. మోసం, నయవంచన చేసినవారికి గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా చలసాని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకోవాలని, ఇలాంటి చర్యలకు ఇంకెవరూ పాల్పడవద్దంటూ పిలుపునిచ్చారు.

తాజావార్తలు