13న ఐటీడీఏ భద్రాచలం ఎదుట టిపిటిఎఫ్ ధర్నా * టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 13న భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట జరిగే నిరసన ప్రదర్శనకు అధిక సంఖ్యలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు. కోయగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూలను వెంటనే విడుదల చేయాలని,ఉపాధ్యాయులకు కేటాయించ బడుతున్న హాస్టల్ అదనపు విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని,రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడనందున సూపర్ న్యూమరరీ పోస్టులన్నింటినీ రెగ్యులర్ పోస్టులుగా మార్చి కన్వర్టెడ్ లేదా అప్ గ్రేడెడ్ ఆశ్రమ పాఠశాలలో సర్దుబాటు చేయాలని,రెగ్యులర్ పోస్టులలో అప్రెంటిస్ ఉపాధ్యాయులుగా నియమించబడిన వారిలో కొందరికి కోర్టు ఉత్తర్వుల ప్రకారం రెగ్యులర్ స్కేలు వర్తింపజేసినట్లుగానే కోర్టు ఉత్తర్వులను తెచ్చుకున్న మరికొందరికి కూడా రెగ్యులర్ స్కేలును వర్తింపజేయాలని, ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి ఉపాధ్యాయులు ఉద్యోగుల సంఖ్య దామాషాను అనుసరించి ఉన్నత స్థాయి డిప్యూటీ డైరెక్టర్,డిటిడిఓ,ఏటిడిఓ,ఏవో పదోన్నతులు కల్పించాలని,జీవో 317 అమలు తర్వాత సూపర్ న్యూమరరీ పోస్టులలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ ఖాళీలలో సర్దుబాటు చేయాలని,జీవో 317 బాధితుల , స్పాజ్ ల అప్పీల్స్ అన్నింటిని పరిష్కరించాలని,గతంలో పనిచేసిన సిఆర్టిలందరినీ రెన్యు