పోలీసులకు ఫిర్యాదు చేసిన పిఎ
న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి): ఢల్లీిలోని మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సౌత్ అవెన్యూలోని ఆయన నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా, మహబూబ్ నగర్‌కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పీఏ రాజు మంగళవారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అపహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిపై మున్నూరు రవి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
- రాష్ట్రంలో మరో ప్రమాదం
- అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్
- 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం
- మీసేవ కేంద్రాల్లో జిరాక్స్ ల పేరుతో నిలువు దోపిడి
- ‘హస్తమే’ ఆధిక్యం
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- మరిన్ని వార్తలు



