పోడుభూముల పోరాటం తీవ్రం

కోయపోషగూడెంలో మరోమారు ఉద్రిక్తత
భద్రాద్రి జిల్లాలో కొనసాగుతున్న గిరిపుత్రుల ఆందోళన

హైదరాబాద్‌,జూలై8(జనంసాక్షి): రాష్ట్రంలో పోడు రైతుల గోస కొనసాగుతోంది. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామన్న సర్కార్‌ పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్‌ ఆపీసర్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాదండేపల్లి మండలం కోయపోషగూడెంలో ఏకంగా 12మంది మహిళలను గత నెలలో ఫారెస్ట్‌ అదికారులు జైలుకు పంపారు. మరోసారి కోయపోష గూడెంలో ఉద్రిక్తత ఏర్పడిరది. పోడుభూముల్లో ఆదివాసీసులు వేసుకున్న గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగించారు. గిరిజనులు అధికారుల కాళ్లపై పడి వేడుకున్నా పట్టించుకోకుండా గుడిసెలను బలవంతంగా పీకేశారు. దీంతో అధికారులు`గిరిజనులకు మధ్య గొడవ జరిగింది. తమ భూముల్లోనే గుడిసెలు వేసుకున్నా బలవంతంగా తొలగించారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలోని కోయపోశగూడెంలో శుక్రవరాం కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోడు భూముల స్వాధీనానికి అధికారులు యత్నించారు. దీంతో పోలీసుల, అటవీశాఖ సిబ్బందిపై ఆదివాసీలు తిరగబడ్డారు. అధికారులపై ఆందోళనకారులు కారం చల్లి, రాళ్లు విసిరారు. వెంటనే ఆందోళనకారులను అరెస్ట్‌ చేసిన పోలీసులు దండేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఐటీడీఏ పీవో వరుణ్‌ రెడ్డి తాళ్ళపేటకు చేరుకున్నారు. కాగా… అధికారుల తీరుపై ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను నెట్టేసి.. తానే చొక్కా చింపుకుని గిరిజనులపై ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఫిర్యాదు చేసారు. ఇకపోతే ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌ లో పోడు రైతులు, బీట్‌ అధికారి చందర్‌ రావుకు మధ్య గొడవ జరిగింది. పోడు భూముల్లో సాగు చేయొద్దంటూ పోడు రైతుల్ని అడ్డుకున్నారు బీట్‌ ఆఫీసర్‌. దీంతో మహిళలకు, ఆఫీసర్‌ కు
మధ్య గొడవ జరిగింది. అయితే మహిళలను కూడా అధికారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అడ్డుకుంటున్న మహిళలను నెట్టిటేసి…. తానే చొక్కా చించుకుని గిరిజనులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫారెస్ట్‌ ఆఫీసర్‌ చందర్‌ రావు.
పట్టాభూములను ఇవ్వాలంటూ జోరువానలోను భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో గిరిజనులు దీక్ష కొనసాగిస్తున్నారు. చీకటిలో, టెంట్లపై నుంచి చినుకులు పడ్తున్నా లెక్క చేయకుండా దీక్షా చేశారు. భూములు ఇచ్చేంత వరకు దీక్ష విరమించేది లేదంటున్నారు. రామన్నగూడెం లోని సర్వే నంబర్‌ 30, 36, 39లలో తమ భూములు ఉన్నాయంటున్నారు గిరిజనులు. పట్టాలున్నా అధికారులు భూమి గుంజుకున్నారని చెబెతున్నారు. భూములు అప్పగించాలంటూ కొన్ని రోజులుగా పోరాటం చేస్తుంటే..భూములపై జాయింట్‌ సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఆదేశించార న్నారు. అధికారులు మాత్రం సర్వే చేయకుండా తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. ఫారెస్ట్‌ టేకు ఎª`లాంటేషన్‌ లో టెంట్‌ వేసి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. రాత్రి వర్షం పడ్తున్నా గిరిజనులు దీక్ష కొనసాగించారు. నల్గొండ జిల్లా సాగర్‌ నియోజకవర్గం సుంకిశాల తండాలో పోడు భూముల్లో మొక్కలు నాటారు ఫారెస్ట్‌ అధికారులు. 50ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో మొక్కలను నాటొద్దంటూ గిరిజనులు అడ్డుకున్నారు. ఫారెస్ట్‌ అధికారిపై కాళ్లపై పడి మరీ తమ భూమిలో మొక్కలు నాటొద్దని ఓ గిరిజన మహిళ వేడుకున్నారు. ఏళ్ల నుండి సాగు చేసుకుంటుంటే.. పార్కు పేరుతో లాక్కున్నారని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దాదాపు 40ఎకరాల పోడు భూములను స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్‌ అధికారులు. చూట్టు ట్రెంచ్‌ నిర్మించి భూముల్లో మొక్కలు నాటడంతో అడ్డుకున్నారు పోడు రైతులు. 50 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటుంటే ఇప్పుడు ఫారెస్ట్‌ అధికారులు పార్కుల పేరుతో లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.