17న విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: పాఠశాలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 17వ తేదిన విద్యా సంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. 10,11వ తేదిల్లో అన్ని డివిజన్‌ జిల్లా కేంద్రాల్లో చేపటనున్నట్లు తెలిపాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎప్‌, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌వో సంఘాల అధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగునున్నాయి. గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు బి.అంజనేయులు, లెనిన్‌బాబు, వేణు, గౌతం ప్రసాద్‌,తేజ, కె.చంద్రమోహన్‌, తదితరులు పాల్గోని వివరాలను వెల్లడించారు. విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఫీజులకు అడ్డుకట్ట వేయాలంటూ శుక్రవారం 6న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పీడీఎస్‌యూ(విజృంభణ)  పిలుపునిచ్చింది.