2కె రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఎంపీడీవో తాళ్లూరి రవి
జూలూరుపాడు, ఆగష్టు 10, జనంసాక్షి:
స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఉదయం 6.30 గంటలకు నిర్వహించ తలపెట్టిన 2కె రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో తాళ్లూరి రవి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. మండల కేంద్రంలోని వెంగన్నపాలెం పంచాయతీ నుండి పోలీస్ స్టేషన్ వరకు 2కె రన్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మండలంలోని అందరు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.