2జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రారంభం

ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలతో 2జీ స్పెక్ట్రమ్‌ వేలం ఢిల్లీలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. వేలం పాటలో ఐదు సంస్థలు పాల్గోన్నాయి, ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రం అంచనా వేసింది. 22 సర్కిళ్లల్లో 122 కంపెనీలకు లైసెన్స్‌లు రద్దు అయిన విషయం తెలిసిందే. లైసెన్సుల రద్దుతో ఈ 122 కంపెనీలకు సుప్రీం ఆదేశాలతో వేలం నిర్వహిస్తున్నారు.