2న పూర్వ విద్యార్థులు సమ్మేళనం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 30  నవోదయ విద్యాలయంలో డిసెంబర్‌ 2వ తేదీన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్‌ చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మేళనంలో జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఇప్పటి వరకు చదివిన పూర్వ విద్యార్థులు పాల్గొని తమ సూచనలు, సలహాలు అందించాలని ఆయన కోరారు.