2న సీఎం పర్యటనకు ఏర్పాట్లు

కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. రాయికల్‌లో చినజీయర్‌ స్వామి ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కళ్యాణ మండపం శంకుస్థాపన తదితర కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.  మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగరరావు, కేంద్రమంత్రి జోలోరాం మార్చి 2న రాయికల్‌ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌నీతూకుమారి ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఎస్పీ శివకుమార్‌తో కలిసి సీఎం పర్యటనపై అధికారులతో సవిూక్షించారు. హెలీప్యాడ్‌, వేదిక, బారికేడ్ల నిర్మాణంతో పాటు రెండు ఫైరింజన్లు సిద్ధంగా ఉంచాలని, తాగునీటి ఏర్పాట్లు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పర్యటన ప్రాంతాల్లో నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని సూచించారు. రాయికల్‌లో నిర్వహిస్తున్న ఏర్పాట్లనూ ఆమె స్వయంగా పరిశీలించారు.