20న తెరాస జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశం
హుజూరాబాద్ : ఈనెల 20న తెరాస పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందని ఆపార్టీ జిల్లా కన్వీనర్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు కరీంనగర్‌లోని మధు గార్డెన్స్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి ఎమ్మెల్యేలు. నియోజక ఇన్చార్జిలు మండలశాఖ అధ్యక్షుడు.పార్టీ అనుబంధ సంఘూల నాయకులతోపాటు జిల్లా రాష్ట్ర కార్యవర్గంలో పనిచేస్తున్న సభ్యలు ముఖ్య కార్యకర్తలు హాజరుకావాలని కోరారు ఈనెల 30 నుంచి జనవరి 10 వరకు నిర్వహించే పల్లెబాట కార్యక్రమం ఉద్యమ కార్యాచరణపై సమావేశంలో చర్చిచటం జరుగుతుందని వివరించారు.