ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం : 20 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్, మే 26 : ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. సంత్ కబీర్‌నగర్ దగ్గర ప్రయాణిస్తున్న గోరఖ్‌నాథ్ ఎక్స్‌ప్రెస్, అదే ట్రాక్‌లో వస్తున్న గూడ్స్ రైలును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటలో 20 మందికి పైగా మృతి చెందగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించగా. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు, అధికారలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు.  రైలు ఘోరఖ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాధం జరిగినట్లు సమాచారం.