2,00,000 రూపాయల ఎల్వోసిని మంజూరు చేయించిన : ఎమ్మెల్యే బీరం .
కోడేరు (జనం సాక్షి) జూలై 06 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని కొండ్రావుపల్లి గ్రామానికి చెందిన కె,కవిత తండ్రి రాముడు అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స చేయించుకునేందుకు తమ పరిస్థితిని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి విన్నవించగా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ₹ 2,00,000 రూపాయల ఎల్వోసిని మంజూరు చేయించారు.
వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బీరం ఎల్వోసిని అందచేశారు.
తమ వినతిని మన్నించి రెండు లక్షల రూపాయల ఎల్వోసిని మంజూరు చేయించినందుకు సిఎం.కేసీఅర్ కి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా వారితో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.