రైతుల పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలి.హెగ్డోలి అన్నదాతలు.

కోటగిరి ఫిబ్రవరి 27 జనం సాక్షి:-రైతుల పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలనీ హెగ్డోలి రైతు లు సోమవారం ఆందొన వ్యక్తం చేశారు.పోతంగల్ పిఎసిఎస్ ఆధ్వర్యంలో హెగ్డోలి గ్రామంలో ఏర్పాటు చేసిన శనగ పంట కొనుగోలు కేంద్రం వద్ద పలు విషయాలపై అన్నదాతలు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఎకరానికి 6 క్వింటా లు మాత్రమే శనగ పంటను కొనుగోలు చేస్తామనడం సబబు కాదన్నారు.ఈ దఫా శనగ పంటకు వాతావ రణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం చేత పంట దిగుబడి పెరిగిందన్నారు.సుమారు ఒక్కొ ఎకరానికి 8నుంచి10 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది.కానీ కొనుగోలు కేంద్రాల వద్ద 6 క్వింటలే కొనుగోలు చేస్తే, మిగిలిన దిగుబడి పంటను  రైతులు ఎక్కడ అమ్ముకోవాలని వారు ఆవేదనను వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం రైతులు పండించిన మొత్తం  శనగ పంటను కొనుగోలు చేసే విధంగా నిబంధనలను అమలు చేయాలన్నారు.అదేవిధంగా పంట నగదు జమ విషయంలో కౌలునామ పత్రం ద్వారా నేరుగా కౌలు రైతుల అకౌంట్లోనే డబ్బులు పడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం లో రైతులు నాగేష్,మారుతి,నారాయణ,పండరినా థ్,పుప్పాల శంకర్,నాగం సాయిలు,తదితరులు ఉన్నారు.