మైనారిటీ సబ్సిడీ లోన్స్ ముఖాముఖి
జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి. 27
పెంట్లవెల్లి మండలంలో ప్రజా పరిషత్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ముఖాముఖిలు నిర్వహించారు ఎంపీడీవో రామయ్య.బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్.మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు ఆన్లైన్ దరఖాస్తు చేసిన పత్రాలతో పాటు విద్యా అర్హత రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆదయ ధ్రువీకరణ పత్రలతో హాజరయ్యారు 171.మంది అప్లై చేసుకోగా 33 మంది హాజరయ్యారు . సబ్సిడీ రుణాల దరఖాస్తు మొత్తం రూ.50 కోట్ల వ్యయంతో నిరుద్యోగులకు సబ్సిడీ రుణాల ఇవ్వనుంది ఈ డబ్బుతో లబ్ధిదారులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు వ్యాపారాలు చేసుకునేందుకు ఇస్తారు.మైనారిటీ వర్గాల్లో పేదల జీవన ప్రమాణాలను పెంచటమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది మొదటి విడతగా 100000. రూపాయలు లోనుకు 80% సబ్సిడీ ఉంటుంది 20000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి లేదా బ్యాంకు లోన్ ద్వారా తీసుకోవచ్చు 2.వ కేటగిరి రెండు లక్షల రూపాయలు లోను కీ 70% సబ్సిడీ ఉంటుంది 30% పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం కేటాయించిన బిజినెస్ బుక్ బైండింగ్. ప్రింటింగ్ ప్రెస్.కార్పెంటర్. ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్. పాన్ షాపు. బేకరీ.ఆటోమొబైల్స్.మరి కొన్నిటికి పరిమితి ఇచ్చింది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామయ్య బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు