22 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు
ఆదిలాబాద్, జూలై 12: శారీరక వికలాంగులు, బదిరులకు అవసరమైన ఉప కరణాలను అందించేందుకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆయా డివిజన్ కేంద్రాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అశోక్ తెలిపారు. ఈ నెల 22న నిర్మల్‌లో, ఆదిలాబాద్, ఉత్నూరు డివిజన్‌లలో ఈ నెల 23వ తేదీన, మంచిర్యాల డివిజన్‌లో 24వ తేదీన, ఆసిఫాబాద్ డివిజన్‌లో ఈ నెల 25వ తేదీన ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ వైద్య శిబిరాలను జిల్లాలోని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వికలాంగుల వివరాలను నమోదు చేసుకునేందుకు 6 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఇద్దరు వైద్యులను ఈ శిబిరాలకు పంపించాలి కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ విషయమై గ్రామాలలో ప్రచారం నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.