2222 కోట్ల నుంచి 711 కోట్ల వాటా!

సింగరేణి కార్మికులకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థకు వచ్చిన నికర 2222 కోట్ల రూపాయల లాభం నుంచి 32 శాతంగా మొత్తం 711 కోట్ల రూపాయల వాటా బోనస్ ( ప్రత్యేక ఇన్సెంటివ్ ) ఇవ్వాలి అని సీఎం కెసిఆర్ ఆదేశించారు.ఆ మేరకు టాక్స్ మినహాయించి ఈ బోనస్ ఇవ్వాలని సీఎంఓ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ఎస్. నర్సింగారావ్ సీఎండీ కి లేఖ రాసారు. ఒక్కో కార్మికుడికి ఒక లక్ష 50 వేల నుంచి లక్ష 70 వేల వరకు ఈ వాటా బోనస్ వస్తుంది.దసరాకు ముందు ఈ వాటా బోనస్ ఇచ్చే అవకాశం ఉంది.తేదిని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ నిర్ణయిస్తారు. దేశంలో లాభాల్లో వాటా బోనస్ పొందుతున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి, తెలంగాణ ఏర్పడిన తర్వాత అద్భుత లాభాలు, టర్న్ ఓవర్ సాధించింది సింగరేణి!ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కాలంలో 10 శాతం నుంచి ప్రారంభం అయిన లాభాల వాటా ( స్పెషల్ ఇన్సెంటివ్ ) బోనస్ ను తెలంగాణ లో సీఎం కెసిఆర్ 32 శాతం కు ఇప్పుడు పెంచారు. అయితే ఇది ప్రత్యేక ఇన్సెంటివ్ కాబట్టి ఇందులో నుంచి ఇన్కం టాక్స్ కోత ను మినహాయించాలని కార్మికులు సీఎం ను కోరుతున్నారు. మొన్ననే వెజ్ బోర్డు బకాయిల నుంచి భారీగా ఐటి ని కోత విదించి, మినహాయించారు, కనీసం ఇప్పుడైనా వెసలు బాటు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. —————-( ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి )