23నుంచి ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాలు

హైదరాబాద్‌: ప్రయాణికుల భద్రతలపై డ్రైవర్లు, కండక్టర్లను మరింత చైతన్యపరిచి, భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఈనెల 23నుంచి 29వరకు ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమాన్ని తొలుత సోమవారం నుంచే నిర్వహించాలనుకున్నా అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు పేర్కొంది.