23వ వార్డులో డబుల్ బెడ్ రూమ్లు దరఖాస్తు చేసుకున్న వారిలో నిజమైన అర్హుల జాబితాను ప్రకటించాలని
ఎంపీడీవో కు వినతి పత్రం ఇచ్చిన స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్
భువనగిరి టౌన్ (జనం సాక్షి):-
భువనగిరి పట్టణ డబల్ బెడ్ రూమ్ దరఖాస్తు చేసుకున్న 23వ వార్డు సంబంధించి సభను స్థానిక దక్షిణేశ్వర ఆలయం ఆవరణలో డబుల్ బెడ్ రూమ్ కోసం 99 మంది దరఖాస్తు చేసుకోగా అర్హులుగా 34 మందిని అనర్హులుగా 65 మందితో కూడిన జాబితాను ప్రకటించడంతో నిజమైన లబ్ధిదారులను అనర్హులు జాబితాలో రావడంతో స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ స్పెషల్ అధికారి మూటకొండూరు ఎంపీడీవో వి,వీరస్వామి,ఎంపీ ఓ ఏ, కిషన్ గార్లను కలిసి వినతి పత్రం సమర్పించి మాట్లాడుతూ నిజమైన డబుల్ బెడ్ రూమ్ అర్హులను అనర్హులను ప్రకటించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన గురవుతున్నారని ఇల్లు లేని నిరుపేదలను పక్షపాతం లేకుండా డబుల్ బెడ్ రూమ్ లో కోసం దరఖాస్తులను చేసుకున్న అన్నిటిని పున పరిశీలించి ఇంటింటా తిరిగి సర్వే నిర్వహించి సొంతిల్లు లేని నిజమైన అర్హుల జాబితాను ప్రకటించాలని సుమారు 23వ వార్డులో 80 మందికి పైగా సొంత గృహాలు లేక అద్దె ఇంట్లో కిరాయిలు కట్టలేక ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని అలాగే ఒక్క ఇంట్లోనే మూడు కుటుంబాలు నివసిస్తున్న వారికి కూడా డబల్ బెడ్ రూమ్ పంపిణి చేయాలని డిమాండ్ జరిగింది ఈకార్యక్రమంలో బర్రె ప్రభాకర్ కృష్ణవేణి రేణుక మాధవి లక్ష్మమ్మ వెంకటేష్ మంగమ్మ జహంగీర్ మహేందర్ లత నరసింహ సాయి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.