23, 24 తేదీల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్
ఆదిలాబాద్, జూన్ 15 : జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ను ఈ నెల 23న చేపట్టనున్నట్లు ఆ సంస్థ పిఓ ముత్యాలరాజు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఈ నెల 23న, ఈ నెల 24న పిఎస్హెచ్ఎంల పదోన్నతి కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులైన ఉపాధ్యాయులు నిజధృవీకరణ, విద్యార్హత పత్రాలతో హాజరు కావాలని ఆయన తెలిపారు.