సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
* టీఎస్ టిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు


టేకులపల్లి,సెప్టెంబర్ 1 (జనం సాక్షి ): సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని టీఎస్ టిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాంకుడోత్ రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ ( టి ఎస్ టి టి ఎఫ్ ) పిలుపు మేరకు శుక్రవారం నూతన పెన్షన్ విధానం సిపిఎస్ రద్దు కొరకు, అన్నీ పాఠశాలలోని ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జిలతో నిరసనలు తెలిపారు. సెప్టెంబర్ ఒకటి, 2004 నుంచి ఈ సిపిఎస్ విధానం అమలులో వచ్చినందున సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ విద్రోహ దినం గా పాటించి, నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేస్తునట్లు తెలిపారు. యుపిఎస్ చింతోని చెలక పాఠశాలలోని ఉపాధ్యాయులతో నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపం గా మారిన ఈ సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చెయ్యాలని ప్రభుత్వాని డిమాండ్ చేసారు.

తాజావార్తలు