నేటి నుండి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం : తాసిల్దార్ నాగ భవాని
18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
డోర్నకల్, సెప్టెంబర్ 1, జనం సాక్షి న్యూస్:డోర్నకల్ మండలం వ్యాప్తంగా ఓటరునమోదు కొరకు అవకాశం కలిపిస్తూ…18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు గా నమోదు చేసుకునేలా నేడు, రేపు స్పెషల్ డ్రైవ్ ప్రత్యేక నమోదుపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తాసిల్దార్ నాగబావని ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు బిఎల్ఓలు, అధికారులు చర్యలు తీసుకోవాలి అని తాసిల్దార్ నాగ భవాని చూచించారు. అక్టోబర్ 1, 2023 నాటికి 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా పోలింగ్ స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ నాగ భవాని ఆదేశించారు. శుక్రవారం తహసిల్దార్ కార్యాలయం నుండి ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంపై మాట్లాడుతూ… నేడు,రేపు రెండు రోజులపాటు మండల వ్యాప్తంగా ఉన్న 41 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాసిల్దార్ నాగ భవాని ఆదేశించారు. ఓటరు నమోదుపై ప్రజల్లో చైతన్యం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తామని సూచించారు.జాబితాలో పేర్లు లేని వారు, కొత్తగా ఓటరు నమోదు కోసం మండలంలోని నేడు రేపు 41 పోలింగ్ కేంద్రంలో స్పెషల్ డ్రైవ్‌ను బీఎల్‌వోల సమక్షంలో విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకు ఆయా బీఎల్‌ఓలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు తదితర జాబితా సవరణపై అధికారులకు పలు సూచనలు ఇచ్చామన్నారు. పోలింగ్ బూత్‌లో ఓటరు నమోదు, జాబితాలో తప్పొప్పుల సవరణ, చనిపోయిన ఓటర్ల తొలగింపు, పోలింగ్ బూత్‌ల మార్పిడి, తదితర పనుల్లో బీఎల్‌వోలు డోర్నకల్ మండలం అన్ని పోలింగ్ బూత్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక ఓటరు నమోదు, మార్పులు,చేర్పులు ముసాయిదా సవరణపై దరఖాస్తులు స్వీకరించాలని, కొత్తగా ఓటరు జాబితాలో పేర్లు లేని వారు 18 సంవత్సరాలు నిండిన వారు ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైట్ ఫొటోలతో ఫారం నంబర్ 6ను పూర్తి చేసి పోలింగ్ బూత్‌లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమం పై ప్రతి గ్రామంలో టాంటాం నిర్వహించి నూతన ఓటర్లు అధిక సంఖ్యలో నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు.ఫారం నంబర్ 7 ద్వారా ఓటరు జాబితాలో పేర్లుండి చనిపోయినట్లయితే వాటిని దరఖాస్తు చేస్తే వాటిని తొలగించాలన్నారు.ఫారం 8 ద్వారా ఓటరు జాబితాలో పేర్లు, తండ్రి పేరు, ఇతర తప్పులుంటే వాటిని సవరించుకునేందుకు దరఖాస్తు తీసుకోవాలని. 8 ఎ ద్వారా పోలింగ్ కేంద్రంలో మార్పుల గురించి వచ్చే దరఖాస్తు ను పరిశీలించాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా ఈ అవకాశాన్ని నూతన ఓటర్లు సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని తాసిల్దార్ నాగ భవాని అన్నారు.