అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి తహసిల్దార్ దేశ్యా .

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం (జనం సాక్షి) న్యూస్

సమావేశంలో మాట్లాడుతున్న తహసిల్దార్ .
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసిల్దార్ గుగులోత్ దేశ్యా నాయక్ అన్నారు.శుక్రవారం ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యలయము ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు తప్పక ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు గాను ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఆక్టోబర్‌ 1, 2023 వరకు 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. మీ ఇంటిలో ఎవరైనా అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు ఎవరు ఉన్నా వారికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరు జాబితాలో నమోదు చేయించాలన్నారు. ముందుగానే ఓటుహక్కు ఉన్నవారు ఓటరు జాబితాలో ఓటు ఉందా… లేదా అని చెక్‌ చేసుకోవాలన్నారు నేను తప్పక ఓటు వేస్తాను అనే కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రతీ ఒక్కరికి ఓటు హక్కుపై అవగాహన కలుగుతుందన్నారు. ఎలాంటి ప్రలోభాలాకు లొం గకుండా ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు. అనంతరం ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం లో వివిధ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు