కెవిపి ఆధ్వర్యంలో పత్తి రైతులకు అవగాహన..

కెవికె బిసిఐ ఎడ్ల సోనీ..

జనం సాక్షి/సైదాపూర్ సెప్టెంబర్2 పత్తి సాగులో కాండానికి మందును పూతపూసే పద్ధతిని పాటించాలని కెవికె బిసిఐ ఎడ్ల సోనీ రైతులకు సూచించారు.గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం పత్తి పంట సాగుపై అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం కాండానికి పూతపూసే విధానంపై రైతు లకు వివరించారు.పత్తిలో తొలిదశలో పచ్చదోమ,పేనుబంక,తామరపురుగు,తెల్లదోమ,పిండినల్లి వంటి రసం పీల్చే పురుగుల నివారణకు విచ్చలవిడిగా రసాయన పురుగుమందులను పిచికారీ చేయవద్దన్నారు. పత్తిలో 30,45 రోజుల్లో మోనోక్రో టోఫాస్‌, నీరు 1ః4 నిష్పత్తిలో, 60 రోజుల వయస్సు లో ఇమిడాక్లోపిడ్‌, లేదా ఫ్లోనికామిడ్‌, నీరు 1ః20 నిష్పత్తిలో కాండం లేత భాగాన బ్రష్‌తో రుద్దాలన్నారు.ఈ విధానాన్ని పాటించడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతిని గణనీయంగా తగ్గించవచ్చన్నారు.ఈ కార్యక్ర మంలో సర్పంచ్‌ పైడిమల్ల సుశీల తిరుపతిగౌడ్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పైడిమల్ల తిరుపతి గౌడ్, రైతులు గుర్రం ఎల్లయ్య,కాశపాక వెంకటేష్,సదానందం,కుమార్,రాజు,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు