పాలెం బిఏ.ఎల్ విద్యార్థులు ఘణ విజయం.

సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్.
విద్యార్థులకు అభినందనల వెల్లువ.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెంలో గల శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో బిఏ.ఎల్-తెలుగు తృతీయ సంవత్సరం విద్యార్థులు ర్యాంకుల వర్షం కురిపించి కళాశాల కీర్తిని చాటారు. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి పీజీ ప్రవేశాలకై ఉమ్మడి జాతీయ స్థాయి ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహించగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఎం.ఏ తెలుగు కోర్సునందు ఎస్.పనిత్రకు ఫస్ట్ ర్యాంక్, బి.అనిల్ కు 46వ ర్యాంక్, యం.ప్రమీల కు 60వ ర్యాంక్ లు వచ్చాయి.అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎంట్రెన్స్ లో ఎం.ఎస్.డబ్ల్యూ కోర్సు నందు ఎస్. ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో 311వ ర్యాంక్ సాధించాడు.ఈ ఫలితంగా రాష్ట్రంలో ఉన్న డిగ్రీ కళాశాలకు పాలెం కళాశాల తలమానికంగా నిలిచి, పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్నది.రాష్ట్రంలో ఏ కళాశాలలో లేని ఈ బిఏ.ఎల్- తెలుగు కోర్సు పాలెం కళాశాల లో కొనసాగుతూ బీధ విద్యార్థుల పాలిట కల్పతరువుగా నిలిచిందని, ఎందరో విద్యార్థులను ఆణిముత్యాలు గా నాటి నుండి నేటి వరకు తీర్చిదిద్దుతుందని, అంచలంచెలుగా ఎదుగుతున్న దని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. విద్యారాణి మాట్లాడుతూ మా కళాశాలకు ఈ ఫలితాలు కూడా ఒక మకుటం లాంటిదని, మరియు కొద్ది రోజులలో మా కళాశాల అటానమస్ గుర్తింపు కూడా సాధించ బోతుందని తెలిపారు.ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా విద్యార్థులకు హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపారు.మరియు కళాశాల అధ్యాపకులు కృష్ణయ్య, నాగరాజు, సుష్మ, శివ, నాగలింగం, రాధాకుమారి, స్వప్న,రామకృష్ణ, రవికుమార్, రమేష్, కృష్ణతేజ,యాదగిరి, మహేశ్వర్ జి,హమీద్, మనోజ్ లతో పాటు అధ్యాపకేతర బృందం కూడా విద్యార్థులకు అభినందనల తెలిపారు.

తాజావార్తలు