చేర్యాల డివిజన్ సాధనకై విద్యాసంస్థల బంద్ సక్సెస్

బందుకు సహకరించిన విద్యాసంస్థలకు కృతజ్ఞతలు

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 02 : చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శనివారం జేఏసీ తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతం అయ్యింది. చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల తరగతులను బహిష్కరించి బంద్ ను విజయవంతం చేశారు. బందుకు సహకరించిన విద్యాసంస్థల యజమాన్యాలకు, విద్యార్థులకు, నాయకులకు చేర్యాల ప్రాంత ప్రజలకు జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్, వైస్ చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి, జేఏసీ నియోజకవర్గ నాయకులు అందె అశోక్, మండల కన్వీనర్ బొమ్మగోని అంజయ్య గౌడ్, పట్టణ కన్వీనర్ తాడెం ప్రశాంత్, కొంగరి వెంకట్ మావో,ఈరి భూమయ్య, కత్తుల భాస్కర్ రెడ్డి, చంద శ్రీకాంత్, బిజ్జ రాము, ఆముదాల రంజిత్ రెడ్డి, పెంబర్ల కనకయ్య, కర్రె నర్సింహులు, సొంటిరెక్కల కుమార స్వామి, శిగుళ్ల గణేష్, వెలుగల రఘువీర్, ఎండీ. అతహర్ అహ్మద్, కొంగరి వెంకట స్వామి, మేడిపల్లి చందు, స్వర్గం శ్రీకాంత్, రేపాక కుమార్, గుండ్ర రవీందర్, పెడుతల ప్రభాకర్ రెడ్డి, ఎండీ. కరీం, మల్లేశం, మల్కని ఎల్లయ్య, బండారి సిద్ధులు, మోకు దేవేందర్ రెడ్డి, దర్శనం రమేష్, మెరుగు ఆదినారాయణ, కాశెట్టి పాండు, కాశెట్టి శ్రీశైలం, దేవనబోయిన సత్యం, ఎస్. కె సమీర్,శెట్టె శ్రీకాంత్, బాలయ్య, రాములు, యాదగిరి, ప్రవీణ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు