సంఘవిద్రోహ శక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు:సిఐ బాబురావు

బయ్యారం, సెప్టెంబర్02(జనం సాక్షి):
బయ్యారం మండలం మొట్ల తిమ్మాపురం గ్రామంలో పోలీస్ శాఖఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో కమ్యూనిటీ ప్రొగ్రామ్ శుక్రవారం నిర్వహించారు.స్థానిక సీఐ
ఈ కార్యక్రమంలో బాగంగా యువకులు సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని యువతకు, ప్రజలకు సూచించారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమయ్యారు. ప్రజలతో మాట్లాడుతూ…యువత వారి గ్రామంలోని ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యే అవకాశంకు సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు స్థానిక సమస్యలు తెలపడంతో సంబంధిత ప్రభుత్వ శాఖ వారితో మాట్లాడి పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు.పోలీసులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఎలాంటి సమస్య ఉన్నా చట్టపరిధిలో పరిష్కరించడం జరుగుతుందని ఇతర సమస్యలేమైనా ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసులు ధ్యేయమన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధికి సహకరించాలని కోరారు.యువత, ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండా లని,బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం, ఓటీపీ వివరాలను చెప్పవద్దన్నారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వారు వస్తే ఆశ్రయం ఇవ్వద్దన్నారు. మావోయిస్టుల ప్రలోభాలకు ఆకర్షితులు కావద్దన్నారు. యువతకు వాలీబాల్ కిట్స్ ని అందించారు.
ఈ కార్యక్రమంలో బయ్యారం ఎస్ఐ ఉపేందర్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

తాజావార్తలు