అర్హులైన పేదలకు దళిత బంధు ఇవ్వాలి
అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి సంబంధించిన దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం చేసి అనర్హులకు కేటాయించారని, ఈ లబ్ధిదారుల లిస్టును రద్దుచేసి అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని కోరుతూ శనివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన మంథనిలోని గ్రామాలలో ఇప్పటికీ దళితులు రేకార్డిదే గాని డొక్కాడని పరిస్థితులలో ఉన్నారని అన్నారు. నిరుపేద దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుక వచ్చినటువంటి దళిత బంధు పథకం ఉన్నత వర్గాలకు వరంగా మారి ఈ పథకం నిర్వీర్యం అవుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు లక్ష్యం మంథనిలో నెరవేరడం లేదని అన్నారు. ఈ మధ్యకాలంలో మంథని మండలానికి సంబంధించిన చెందిన దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక లిస్టు లో అవినీతి అక్రమాలు జరిగాయని నిరుపేదల నోట్లో మట్టి కొట్టి ప్రజాప్రతినిధుల పేర్లు రావడం దీనికి నిదర్శనం దళితులను మోసం చేయడమే అని అన్నారు వెంటనే ఈ లబ్ధిదారుల లిస్టును రద్దుచేసి అర్హులైన నిరుపేదలు దళిత బంధు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు లేనియెడల గ్రామాలలోని దళితులను ఏకం చేసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో *వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్ , దళిత ప్రజా సంఘాల నాయకులు బూడిద తిరుపతి, మంథని లింగయ్య, అడ్డూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు.