విద్యార్థులు నూతన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

సెక్టోరియల్ అధికారి భేతి భాస్కర్

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 02 : విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నూతన నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు కృషి చేయాలని సమగ్ర శిక్ష సిద్దిపేట సెక్టోరియల్ అధికారి భేతి భాస్కర్ అన్నారు. శనివారం తాడూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో వివేకానంద విజ్ఞాన్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన మూటకోడూరు చక్రపాణి సహకారంతో విద్యార్థులకు టై, బెల్టు, ఐడి కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చక్కగా చదివి ఇరవై ఒకటవ శతాబ్దపు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని చక్కని భవిష్యత్తు నిర్మించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు చక్రపాణిని, యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్, యూత్ బాధ్యులు ఈరు పవన్, అఖిల్, వెంకట్ చారి, మహేష్, శోభన్, ఉపాధ్యాయులు

తాజావార్తలు